13. శ్లో॥ వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుస్సామపారగః |
ఘనవృష్టిరపాంమిత్రో | వింధ్య వీధీ ప్లవంగమః ॥
వ్యోమనాధః = ఆకాశానికి పతి
తమోభేదీ = చీకటిని బోగొట్టువాడు.
ఋగ్యజుస్సామపారగః = ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, పూర్తిగ చూచిన వాడు
ఘనవృష్టిః = గొప్పవర్షము నిచ్చువాడు.
అపాంమిత్రః = జలములకు మిత్రుడన
వింధ్యవీధీప్లవంగమః = దక్షిణాయ; మందు వింధ్యమార్గము సంచరించువాడు
భావం:- ఆకాశానికి అధిపతియవడం వల్ల అతనికివ్యోమనాధుడనే పేరు వచ్చింది. చీకటిని చీల్చుకొని వేదత్రయీనాదాన్ని లోకత్రయికి వినిపిస్తు మేఘాలను మెరిపిస్తూ వర్షాన్ని కురిపిస్తూ నీళ్ళతో చెలిమి చేసి , వింద్యాచలం మీద దక్షిణాయనంలో గంతులు వేస్తాడీ సూర్యుడు.
14. శ్లో॥ అతపీమండలీ మృత్యుః పింగళస్సర్వతాపనః
(క) రవిర్విశ్వో మహాతేజాః | రక్తస్సర్వ భవోద్భవ ॥
ఆతపీ = ఎండకాయువాడును
మండలీ = మండలాకారం కలవాడు
మృత్యుః = మృత్యు స్వరూపుడును
పింగళః = తేనెవంటి పచ్చని రంగు కలవాడు
సర్వతాపనః = అందరిని తపింపచేయువాడును
కవిః = విద్వాంసుడును
విశ్వః = ప్రపంచ స్వరూపుడును
మహాతేజాః = గొప్ప తేజశ్శాలియూ
రక్తః = ఎఱ్ఱని వర్ణముగలవాడును
సర్వభవోద్భవః = సమస్త కార్య సమూహము యొక్క ఉత్పత్తికి హేతువైనవాడు
భావం:- కోపమువస్తే కాలాగ్నిలా మండిపడును. సూర్యమండలం అతనికి జన్మకుండలి. ఆ మండలికి ఆతడే ప్రభువు. ఉదయకాలంలో పింగళ వర్ణంలో ఉంటాడు. అవసరమైనప్పుడు ప్ర్రాణులందరినీ తపింప జేస్తాడు. నూతనంగా ప్రపంచాన్ని సృష్టించగలవాడు గాన కవియను నామము ఈతనికి సార్ధకము. విశ్వరూపుడైన అతని దివ్య తేజస్సులో రంజిల్లని అంశము లేదు అన్ని భావాలకు, భవములకు, భువనాలకు
అతడే మూలము.
15. శ్లో॥ నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే ॥
నక్షత్ర = ఆశ్వన్యాది నక్షత్రములు
గ్రహ = చంద్రాది గ్రహములు
తారాణాం = చుక్కలకు
అధిపో = ప్రభువును
విశ్వభావనః = విశ్వస్థితికి మూలమైనవాడు
తేజసామపి = తేజస్సు కలవానికి కూడ
తేజస్వీ = గొప్ప తేజస్సు గలవాడవగు
ద్వాదశాత్మన్ = పన్నెండు మూర్తులుగలసూర్యభగవానుడవగు
తే = నీకు
నమః = నమస్కారము
ఆస్తు = అగుగాక
భావం :- ఆకాశంలో కనిపించే ఆశ్వని మొదలు రేవతి వరకుగల ఇరువదియేడు నక్షత్రములకు , కదలికగల చంద్రాది గ్రహములకు, కదలిక లేని చుక్కలకు, సూర్యుడే ప్రభువు. మన సూర్యునిలాంటి సూర్యులు అనేకమంది బ్రహ్మాండములో ఉన్నారు. వారికి ఆది సూర్యుడు ఆదిత్యుడు. అలాంటి ఆదిత్యులు పన్నెండుమంది. వారిలో విష్ణువు ప్రధానుడు. ఈద్వాదశాత్మ స్తుతితోటి ఆదిత్యహృదయం లోని పూర్వార్ధం అనగా స్తుతిభాగం ముగుస్తుంది.
No comments:
Post a Comment