మాటల పక పకలు
మీరు ఎటు చదివినా మా పేర్లు మారవు1. నంద నందనం
2. రంగ నగరం
3. వికట కవి
4. రామా కుమారా
5. గడపలో పడగ
6. కిటికి
7. పాలు నలుపా
8. లుకలుకలు
9. ముత్యము
మాటల గారడి
1. రాజు కాని రాజు - తరాజు
2. తారు కాని తారు – జలతారు
3. పతి కాని పతి - తిరుపతి
4. జనము కాని జనము – భోజనము
5. బడి కాని బడి – రాబడి
6. వరం కాని వరం – కలవరం
7. గొడుగు కాని గొడుగు - పుట్ట గొడుగు
8. తాళం కాని తాళం – పాతాళం
9. వెల కాని వెల – కోవెల
10. దారి కాని దారి - గోదారి
పొడుపు కధలు
1. అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మకు కొటి పువ్వులు, అన్ని పువ్వుల్లో రెండే కాయలుజ) ఆకాశం, చుక్కలు, సూర్యుడు, చందమామ
2. నిద్రిస్తునే ఉంటాను, కాని కన్ను మూయను
జ) చేప
3. పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు
జ) సీతా ఫలం
4. పళ్ళు ఉన్నా నోరు లేనిది
జ) రంపం
5. అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది
జ) గజం బద్ద
6. నాలుగు స్తంభాలు నడవంగా రెండు చేతులు తెరగంగా చక్కని దొరలు ఎక్కేరు ? ఏమిటిది ?
జ) ఏనుగు
సామెతలు
ఒక జాతి సంస్కృతికి అద్దం పట్టేవి సామెతలు. మాటకు సామెత సొంపునిస్తుంది. పెద్దలు తమ అనుభవంతో చెప్పినవే సామెతలు. సామెతలను చేకోక్తులు, నానుడులు అని కూడా అంటారు.సామెతలు
1. ఉన్న ఊరు కన్నతల్లి లాంటివి
2. కట్టు లేని ఊరు – గట్టులేని చెరువు
3. మొక్కై వంగనిది మానై వంగుతుందా!
4. వజ్రానికి సాన – బుద్దికి చదువు
5. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా!
6. ఎంత చెట్టుకు అంత గాలి
7. అడుసు తొక్కనేల కాలు కడగనేల
8. ఇంట గెలిచి రచ్చ గెలువు
No comments:
Post a Comment