Sunday, February 12, 2012

ఎదురు చూపులు





 ఎదురు చూపులు

కమ్మగా పాడే కోయిలనడిగాను, నీ తీయని మాటలతో నను మురిపించేది ఎప్పుడని ... 
చల్లగా వీచే చిరుగాలిని అడిగాను , నీ చల్లని చూపుతో నను తాకేది ఎప్పుడని.. 
వర్షించే మేఘాన్ని అడిగాను , నీ నవ్వుల జల్లుల్లో నను తడిపేది ఎప్పుడని ... 
హాయిని పంచే వెన్నెలని అడిగాను , ఆ వెన్నల్లో హాయిగా ఊసులడేది ఎప్పుడని ... 
పరుగులు తీస్తున్న సెలయేటిని అడిగాను , నీ పరుగు నా కోసమేనా ? అని ...
నాలో ఉన్న నా ప్రాణమైన నీకు తెలిపాను , నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని , 
నా దరి చేరమని ..... నను బ్రతికించమని ......

2 comments: